Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ నేత, విశాఖ డెయిరీ డైరెక్టర్ పై వెంటాడి, వేటాడి కత్తులతో దాడి..

విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడి గ్రామానికి చెందిన విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణపై కొందరు దుండగులు వెంటాడి వెంటాడి మరీ కత్తులతో దాడి చేశారు. 

విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడి గ్రామానికి చెందిన విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణపై కొందరు దుండగులు వెంటాడి వెంటాడి మరీ కత్తులతో దాడి చేశారు. అదే గ్రామానికి చెందిన 8 మంది దుండగులు కత్తులతో వెంటాడి మరీ దాడి చేశారు. గ్రామంలోని తులసి కల్యాణ మండపం సమీపంలో తన అనుచరులతో కలిసి జాగింగ్ చేస్తండగా  ఈ దాడి జరిగింది. ఇద్దరు అనుచరులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో టీడీపీలో ఉన్న సత్యనారాయణ ఈ మధ్యే వైసీపీలో చేరారు. అయితే ఈ దాడి వైసీపీ వర్గాలే చేశాయని అంటున్నారు. 

Video Top Stories