''సైడ్ ఇవ్వలేదని ఆటో డ్రైవర్ ను బంధించి... అవినాష్ అనుచరుల దాష్టికం''

విజయవాడ : వైసిపి నేత దేవినేని అవినాష్ అనుచరులు సామాన్యుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని జనసేన అధికార ప్రతినిధి, విజయవాడ అధ్యక్షులు పోతిన మహేష్ ఆందోళన వ్యక్తం చేసారు. 

First Published Aug 23, 2023, 3:27 PM IST | Last Updated Aug 23, 2023, 3:27 PM IST

విజయవాడ : వైసిపి నేత దేవినేని అవినాష్ అనుచరులు సామాన్యుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని జనసేన అధికార ప్రతినిధి, విజయవాడ అధ్యక్షులు పోతిన మహేష్ ఆందోళన వ్యక్తం చేసారు. కేవలం తన కారుకు సైడ్ ఇవ్వలేదని ఓ ఆటోడ్రైవర్ ను పట్టుకుని అవినాష్ అనుచరుడు యుగందర్ బాబు చితకబాదినట్లు మహేష్ ఆరోపించారు. ఆటో డ్రైవర్ మోహన్ ను నిన్న రాత్రి అవినాష్ దొడ్లోనే బంధించి దాడి చేసారని... కొడుకు కోసం వెళ్లిన తల్లి దుర్గారాణిని కూడా బూతులు తిట్టారని అన్నారు. ఆటో డ్రైవర్ పై దాడి ఘటనకు అవినాష్ బాధ్యుడని మహేష్ ఆరోపించారు.

అడ్డూఅదుపు లేకుండా అవినాష్, ఆయన అనుచరులు చేస్తున్న రౌడీయిజంపై గతంలోనే విజయవాడ పోలీస్ కమిషనర్ కి చెప్పానని... అయినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని మహేష్ అన్నారు. ఇప్పటికైనా ఆటో డ్రైవర్ పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకుని అవినాష్ అనుచరులపై తక్షణమే కేసు నమోదు చేయాలన్నారు. బాధితుడికి అండగా నిలబడి న్యాయం చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. మోహన్ కి అండగా ఉండి న్యాయం జరిగే వరకూ న్యాయపోరాటం చేస్తామని పోతిన మహేష్ తెలిపారు.