Asianet News TeluguAsianet News Telugu

ఆశా వర్కర్లపై.. వైసీపీ మాజీ ఎంపీపీ దాడి యత్నం..

తొట్లవల్లూరు, కరోనా విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ పై దురుసుగా మాట్లాడి, దాడికి ప్రయత్నించాడు తొట్లవల్లూరు మాజీ ఎంపీపీ, వైసీపీ నాయకుడు కళ్ళం వేంకటేశ్వర రెడ్డి. 

First Published Apr 17, 2020, 10:51 AM IST | Last Updated Apr 17, 2020, 10:51 AM IST

తొట్లవల్లూరు, కరోనా విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ పై దురుసుగా మాట్లాడి, దాడికి ప్రయత్నించాడు తొట్లవల్లూరు మాజీ ఎంపీపీ, వైసీపీ నాయకుడు కళ్ళం వేంకటేశ్వర రెడ్డి. వెంకటేశ్వరరెడ్డి బంధువులు  హైద్రాబాద్ నుండి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఆశా వర్కర్, వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసు అసిస్టెంట్, గ్రామస్థులు వారిని ఊరిలోకి రావడాన్ని అడ్డుకుని క్వరంటాయిన్ లో ఉంచాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కళ్ళం వేంకటేశ్వర రెడ్డి ఆశా వర్కర్ ను అసభ్యకరంగా తిడుతూ, కళ్ళు తాగే వారిని, గుంపులుగా వుండే వారిని అడ్డుకోండి.. మా వాళ్లకు కరోనా లక్షణాలు ఉన్నాయా అంటూ దూకుడుగా వ్యవహరించాడు. దీనిమీద ఆశా వర్కర్ ఏడ్చుకుంటూ మీడియాకు, యూనియన్ వారికి తెలిపింది.