Asianet News TeluguAsianet News Telugu

మంత్రి జోగి అవినీతి పోస్టర్ల కలకలం... జనసేన కార్యకర్తలపై వైసిపి నాయకుల దాడి

విజయవాడ : కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ జనసేన పార్టీ నాయకుడు యడ్లపల్లి రామ్ సుధీర్ గోడ పోస్టర్లు ప్రింట్ చేయించిమరీ ప్రచారం చేస్తున్నాడు.

First Published Nov 18, 2022, 12:38 PM IST | Last Updated Nov 18, 2022, 12:38 PM IST

విజయవాడ : కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ జనసేన పార్టీ నాయకుడు యడ్లపల్లి రామ్ సుధీర్ గోడ పోస్టర్లు ప్రింట్ చేయించిమరీ ప్రచారం చేస్తున్నాడు.ఈ నెల 11న మంత్రిని ప్రశ్నిస్తూ వాల్ పోస్టర్ విడుదల చేసిన రామ్ సుధీర్ పట్టణమంతా అతికించే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలోనే పట్టణంలో ఈ గోడపోస్టర్లు అతికిస్తున్న జనసేన నాయకులపై వైసిపి శ్రేణులు దాడులకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదని... చివరకు ఎస్సై ముందే జనసైనికులపై వైసిపి నాయకులు దాడిచేసారని ఆరోపిస్తున్నారు. వెంటనే జనసేన కార్యకర్తలపై దాడిచేసిన వైసిపి నాయకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెడన పోలీస్టేషన్ వద్ద యడ్లపల్లి రామ్ సుధీర్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.