పొత్తులు పెట్టుకునే ఖర్మ మాకు లేదు, మేము సింగిల్ గానే బరిలోకి దిగుతాము : ఎంపీ విజయసాయి రెడ్డి
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ లో YSR కాంగ్రెస్ పార్టీ మెగా జాబ్ మేళాను ఎంపి విజయసాయి రెడ్డి ప్రారంభించారు.
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ లో YSR కాంగ్రెస్ పార్టీ మెగా జాబ్ మేళాను ఎంపి విజయసాయి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతోందని, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఓటమి భయంతోనే కొందరు పొత్తులు పెట్టుకుంటారని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేసారు. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్న వైకాపా విజయాన్ని ఆపలేరని, మరో 20, 25 ఏళ్ళు అధికారం వైసీపీ సొంతమని, చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.