మీ సానుభూతే కాదు డబ్బులూ మాకొద్దు..: ఇప్పటం బాధితుల ఇళ్లముందు బ్యానర్లు, ప్లెక్సీలు

గుంటూరు : మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అభివృద్ది వైసిపి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని...

First Published Nov 10, 2022, 11:16 AM IST | Last Updated Nov 10, 2022, 11:16 AM IST

గుంటూరు : మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అభివృద్ది వైసిపి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని... ఇందుకు తాము సహకరిస్తామంటూ ఇప్పటం గ్రామంలో బ్యానర్లు, ప్లెక్సీలు వెలిసాయి. ఇటీవల రోడ్డు విస్తరణ కోసం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత వివాదాస్పదంగా మారడం... బాధితులకు పవన్ అండగా నిలిచి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు బాధితుల ఇళ్లముందు వెలిసిన ప్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి.  ఇప్పటం అభివృద్ది కోసం ప్రభుత్వ స్థలాన్నే తీసుకున్నారు... మా సొంత స్థలాలేమీ తీసుకోలేదని కొందరు బాధితులు పేర్కొన్నారు. కాబట్టి మాపై ఎవరూ సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని... వారిచ్చే డబ్బులు కూడా మాకు వద్దంటూ ఇళ్లముందు బ్యానర్ల పెట్టారు. డబ్బులిచ్చి అబద్దాలు నిజం చేయాలని ప్రయత్నించొద్దందూ పరోక్షంగా జనసేన, టిడిపి లకు సూచించారు. అలాగే 
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంప్థ అభివృద్దికి ముఖ్యమంత్రి జగన్ రూ.137 కోట్లు కేటాయించారని... అందులోంచి కేవలం ఇప్పటం అభివృద్దికే ఆరు కోట్లను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కేటాయించారంటూ భారీ ప్లెక్సీలు కూడా వెలిసాయి. ఏఏ పనులకు ఎంతెంత కేటాయించారో ప్లెక్సీల్లో క్లియర్ గా పేర్కొన్నారు.