ఎడ్లబళ్లపై సీఎం జగన్, వైఎస్సార్ కటౌట్లతో... తాడేపల్లిలో యూ1 జోన్ రైతుల భారీ ర్యాలి

తాడేపల్లి : గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, కుంచనపల్లి, కొలనుకొండ గ్రామాల పరిధిలో యూ1 రిజర్వ్ జోన్‌ను రద్దు చేస్తూ జగన్ సర్కార్ ప్రకటన వెలువడిన వెంటనే రైతులు సంబరాల్లో మునిగిపోయారు.

First Published Aug 28, 2022, 2:51 PM IST | Last Updated Aug 28, 2022, 2:51 PM IST

తాడేపల్లి : గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, కుంచనపల్లి, కొలనుకొండ గ్రామాల పరిధిలో యూ1 రిజర్వ్ జోన్‌ను రద్దు చేస్తూ జగన్ సర్కార్ ప్రకటన వెలువడిన వెంటనే రైతులు సంబరాల్లో మునిగిపోయారు. యూ1 జోన్ రద్దుకు సంబంధించి జీవో విడుదలవగానే రైతుల దీక్షా శిబిరంవద్ద కోలాహలం మొదలయ్యింది. రిజర్వ్ జోన్ తొలగింపు నేపథ్యంలో రైతులు సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్సార్, వైసిపి జెండాలను ఎడ్లబండ్లపై కట్టి ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి వైఎస్సార్ సెంటర్ వరకు బ్యాండ్ మేళాలతో ఈ ర్యాలీ సాగింది. రైతుల ఆనందంతో చిందులేసారు. తమ మొర ఆలకించి యూ1 జోన్ రద్దుచేసిన ముఖ్యమంత్రి జగన్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.