కారుతో ఢీకొట్టి, రివర్స్ లో తొక్కించి వైసీపీ కార్పోరేటర్ హత్య

కాకినాడ:  తూర్పు గోదావలి జిల్లాలోని కాకినాడ రూరల్ లో వైసీపీ కార్పోరేటర్ రమేష్ ను అత్యంత దారుణంగా హత్య చేశారు.

First Published Feb 12, 2021, 1:32 PM IST | Last Updated Feb 12, 2021, 1:32 PM IST

కాకినాడ:  తూర్పు గోదావలి జిల్లాలోని కాకినాడ రూరల్ లో వైసీపీ కార్పోరేటర్ రమేష్ ను అత్యంత దారుణంగా హత్య చేశారు. తొలుత కత్తులతో పొడిచి చంపినట్లు భావించారు. అయితే, సీసీటీవీ ఫుటేజీలో వాస్తవం బయటపడింది. రమేష్ ను తొలుత కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత రివర్స్ తీసుకుని కారుతో రెండు మూడుసార్లు తొక్కించారు. 

ఈ సంఘటన గత అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు జరిగింది. నిందితుడిని గురుజాల చిన్నాగా పోలీసులు గుర్తించారు.  రమేష్ హత్యకు రాజకీయ కక్షలు కారణమా, ఆర్థిక లావాదేవీలు కారణమా అనే కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. తొలుత ప్రమాదంగా భావించినప్పటికీ రివర్స్ కూడా తీసుకుని కూడా కారుతో తొక్కించడంతో కావాలనే హత్య చేసినట్లు భావిస్తున్నారు