యాదవ సామాజిక వర్గంపై ఎంపీ విజయసాయి రెడ్డి వరాలజల్లు
విశాఖపట్నం: యాదవ సామాజిక భవనం ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వెల్లడించారు.
విశాఖపట్నం: యాదవ సామాజిక భవనం ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన యాదవ సామాజిక భవన నిర్మాణం కొసం ఆరిలోవలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించడంతో పాటు ఆర్కే బీచ్ రోడ్ లోని రాధాకృష్ణ మందిరాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ఇటివల యాదవ సామాజిక వర్గ పెద్దలు తనను కలిసిన సందర్భంగా విశాఖ నగరంలో ఒక సామాజిక భవనం నిర్మించాలని కోరినట్లు చెప్పారు. అందుకోసం ఆరిలోవ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని సందర్శించినట్టు వెల్లడించారు. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సామాజీక భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఆర్కే బీచ్ లో ఉన్న గోకుల్ పార్కు, రాధాకృష్ణ మందిరాన్ని అభివృద్ధి చెయ్యాలని యాదవ సోదరులు కోరినట్టు ఆయన వెల్లడించారు. రాధాకృష్ణ మందిరంలోని మండపాన్ని పునఃనిర్మాణం చేపట్టడంతో పాటుగా శ్రీకృష్ణుని జీవిత చరిత్ర తెలిపే విధంగా చిన్నపాటి మ్యూజియంను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని... దీన్ని పరిశీలించారని జీవీఎంసీ మేయర్, కమిషనర్లకు సూచించినట్లు ఎంపి విజయసాయిరెడ్డి వెల్లడించారు.