Asianet News TeluguAsianet News Telugu

World Tourism Day 2022 : ''విజిట్ ఆంధ్ర ప్రదేశ్ 2023'' క్యాంపెయిన్ ప్రారంభించన సీఎం జగన్

అమరావతి :  వరల్డ్‌ టూరిజం డే 2022 వేడుకలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు.

First Published Sep 27, 2022, 3:47 PM IST | Last Updated Sep 27, 2022, 3:52 PM IST

అమరావతి :  వరల్డ్‌ టూరిజం డే 2022 వేడుకలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటకాభివృద్దిలో భాగంగా ''విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌ 2023'' పేరిట క్యాంపెయిన్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. అలాగే ఏపీలోని పర్యాటక ప్రదేశాలను సులువుగా గుర్తించేలా రూపొందించిన జీఐఎస్‌ వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు నుండి వచ్చిన గిరిజన సాంప్రదాయ థింసా నృత్యకారులతో కాస్సేపు ముచ్చటించారు. అనంతరం టూరిజం, ట్రావెల్, ఆతిధ్య రంగ అభివృద్దికి మరింత కృషి చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ స్సెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.