Asianet News TeluguAsianet News Telugu

సత్తెనపల్లి సచివాలయానికి తాళం వేసి... బాధిత మహిళల ఆందోళన

సత్తెనపల్లి : అన్ని అర్హతలున్నా వైఎస్సార్ ఈబిసి నేస్తం డబ్బులు అందకపోవడంతో ఆగ్రహించిన మహిళలు సచివాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.

First Published Sep 29, 2022, 4:52 PM IST | Last Updated Sep 29, 2022, 4:52 PM IST

సత్తెనపల్లి : అన్ని అర్హతలున్నా వైఎస్సార్ ఈబిసి నేస్తం డబ్బులు అందకపోవడంతో ఆగ్రహించిన మహిళలు సచివాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం పెదమక్కన గ్రామానికి చెందిన కొందరు మహిళలు వైఎస్సార్ ఈబిసి నేస్తం డబ్బుల కోసం దరఖాస్తూ చేసుకున్నారు. అయితే వీరిలో కొందరి కుల దృవీకరణ పత్రాలు సరిగ్గా లేవంటూ సచివాలయ సిబ్బంది సంవత్సర కాలంగా కాలయాపన చేస్తున్నారు. మంత్రులను కలిసి విన్నవించుకున్నా, స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఆగ్రహించిన 45 మంది బాధిత మహిళలు స్థానిక సచివాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సచివాలయ భవనానికి తాళం వేసి సిబ్బందిని లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.