Asianet News TeluguAsianet News Telugu

నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళల దాడి... రోడ్డుపై బైఠాయించి ఆందోళన

 ఏలూరు : పెళ్లిచేసి అత్తారింటికి పంపిన కూతురు ఆచూకీ లేకపోవడంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడికి యత్నించిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.

 ఏలూరు : పెళ్లిచేసి అత్తారింటికి పంపిన కూతురు ఆచూకీ లేకపోవడంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడికి యత్నించిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. మహిళల ఆందోళనతో నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే... ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కునపరాజుపర్వ గ్రామానికి చెందిన ఐశ్వర్యకు ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామానికి చెందిన రాజ్ కుమార్ తో మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నాటినుండి రాజ్ కుమార్ అదనపు కట్నం కోసం ఐశ్వర్యను వేధించడంతో ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి కన్నీరుపెట్టుకుంది. దీంతో తాజాగా కూతురిని చూడటానికి వెళ్లిన తల్లిదండ్రులకు అత్తవారింట్లో ఆమె కనిపించలేదు. అప్పటికే అల్లుడు రాజ్ కుమార్ ను నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఐశ్వర్య కనిపించక ఆగ్రహంతో వున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకునివెళ్లి రాజ్ కుమార్ పై దాడికి యత్నించారు. ఈ క్రమంలో మహిళలకు, పోలీసులకు మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది.  ఐశ్వర్య జాడ చెప్పాలంటూ కునపరాజుపర్వ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు.

Video Top Stories