మంగళగిరి పోలీస్ స్టేషన్ ముందు మహిళల ఆందోళన ... సీఐపై తీవ్ర ఆరోపణలు
గుంటూరు : తమవారిపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు ఇబ్బందిపెడుతున్నారని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్ ముందు కొందరు మహిళలు ఆందోళనకు దిగారు.
గుంటూరు : తమవారిపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు ఇబ్బందిపెడుతున్నారని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్ ముందు కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. స్థానిక సీఐ లంచం తీసుకుని తమవారిని మర్డర్ కేసులో ఇరికించాలని చూస్తున్నారని మహిళలు ఆరోపించారు. తమకు న్యాయం జరిగేవరకు ఆందోళనను విరమించబోమంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి మహిళలు ఆందోళనకు దిగారు.
నాలుగేళ్ల క్రితం తాడిబోయిన ఉమా యాదవ్ ను హత్యకు గురయ్యాడు. ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేకున్నా మహేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అతడి కుటుంబసభ్యులు అంటున్నారు. మహేష్ పై అక్రమ కేసులు బనాయిస్తున్న సీఐ హత్యకేసులో రాజీకి రావాలంటూ తమను కూడా వేదిస్తున్నాడని అతడి సోదరి తెలిపింది. అయితే సీఐ అంకమ్మరావు మాత్రం మహిళల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని... చట్టప్రకారమే తాను నడుచుకుంటున్నానని తెలిపాడు.