Asianet News TeluguAsianet News Telugu

ప్రవచనకర్త గరికపాటిపై మరో వివాదం... విశాఖలో మహిళా సంఘాల ఆందోళన

విశాఖపట్నం : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో కొందరు మహిళలు విశాఖపట్నంలో ఆందోళనకు దిగారు.

First Published Nov 17, 2022, 1:10 PM IST | Last Updated Nov 17, 2022, 1:10 PM IST

విశాఖపట్నం : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో కొందరు మహిళలు విశాఖపట్నంలో ఆందోళనకు దిగారు. తన ప్రవచనాల్లో ప్రతిసారీ మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తారంటూ గరికపాటిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలా మహిళాసాధికారతను ఆద్యాత్మిక ముసుగులో అణచివేయాలని చూస్తున్న గరికపాటిపై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేసారు. 

విశాఖ నగరంలోని జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళాసంఘాల ఆధ్వర్యంలో గరికపాటికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. హిందూ ధర్మ ప్రవచనాల పేరుతో మహిళలను అవమానించేలా వ్యవహరిస్తున్న గరికపాటి నరసింహారావుపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. గరికపాటిపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని మహిళలు తెలిపారు.