మాచర్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీస్ పై మహిళల దాడి... ఫర్నీచర్ ధ్వంసం
మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (SEB) కార్యాలయంపై కొందరు మహిళలు దాడి చేసారు.
మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (SEB) కార్యాలయంపై కొందరు మహిళలు దాడి చేసారు. నాటుసారా తయారీ కేసులో ఉప్పుతోల రాజు అనే వ్యక్తిని సెబ్ పోలీసులు అరెస్ట్ చేసారు. దీంతో అతడి భార్య జ్యోతి చంటిబిడ్డతో సెబ్ కార్యాలయం ఎదుట తన భర్తను వదిలిపెట్టాలంటూ కన్నీరుపెట్టుకుని ఆందోళనకు దిగింది. అయినప్పటికి రాజును విడిచిపెట్టకపోవడంతో ఆగ్రహించిన మహిళలు సెబ్ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్ ధ్వంసం చేసారు.