టిడిపి మాజీ ఎమ్మెల్సీ బచ్చులకు చుక్కెదురు... రోడ్డుపై పట్టుకుని నిలదీసిన మహిళ

గన్నవరం : వైసిపి ప్రభుత్వ హయాంతో నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్, ఆర్టిసి తదితర ఛార్జీలు పెంచడాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రతిపక్ష టిడిపి బాదుడే బాదుడు పేరిట నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.

First Published Aug 9, 2022, 10:38 AM IST | Last Updated Aug 9, 2022, 10:38 AM IST

గన్నవరం : వైసిపి ప్రభుత్వ హయాంతో నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్, ఆర్టిసి తదితర ఛార్జీలు పెంచడాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రతిపక్ష టిడిపి బాదుడే బాదుడు పేరిట నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామానికి వెళ్లిన టిడిపి నాయకులకు చుక్కుదురయ్యింది. ఓ మహిళ టిడిపి నాయకులను రోడ్డుపైనే పట్టుకుని ఏం చేసినా మా ఓటు స్థానిక ఎమ్మెల్యే వంశీకేనని ముఖం మీదే చెప్పింది. 

టిడిపి నాయకులు బచ్చులు అర్జునుడు, ముద్ర బోయిన వెంకటేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్ రావు తిప్పనగుంటలో బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నించిన బచ్చుల అర్జునుడికి ఓ మహిళ ఎదురుతిరిగింది. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తమకు ఏదయినా చేస్తారని... అందుకే ఇకపైనే ఆయనకే మద్దుతుగా వుండి ఓటేస్తామని మహిళ తెలిపింది. అప్పుడప్పుడు వచ్చివెళ్లే మీరు గ్రామంలో ఎందుకు తిరుగుతున్నారంటూ నిలదీసింది. దీంతో చేసేదేమిలేక టిడిపి నాయకులు అక్కడినుండి ముందుకు కదిలారు.