Asianet News TeluguAsianet News Telugu

నడిరోడ్డుపై మహిళ హల్ చల్... తమ్ముడు ప్రేమించిన అమ్మాయిపై కత్తితో దాడి

గన్నవరం: ఓ మహిళ తన తమ్ముడి ప్రేయసిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా గన్నవరంలో చోటుచేసుకుంది. 

గన్నవరం: ఓ మహిళ తన తమ్ముడి ప్రేయసిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా గన్నవరంలో చోటుచేసుకుంది. తన తమ్ముడు బట్టల కొట్టులో పనిచేసే మనీషా అనే వేరే కులానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అలివేలు మంగతాయారు(46)కు తెలిసింది. తన తమ్ముడిని వదిలేయమని పలుమార్లు హెచ్చరించినా మనీషా వినకపోవడంతో మంగతాయారు దారుణానికి ఒడిగట్టింది.తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని హతమార్చాలని భావించిన మంగతాయారు కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో మనీషా గాయపడింది. గాయపడిన యువతిని స్థానికులు గన్నవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మంగతాయారును అరెస్ట్ చేశారు.