Asianet News TeluguAsianet News Telugu

తలలు పగిలి రక్తం చింది... బొబ్బిలిలో మహిళా కూలీల ఆందోళన ఉద్రిక్తం

విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మైదాన్ కర్మాగారాన్ని తెరిచి తమకు ఉపాధి ఇవ్వాలంటూ కొందరు మహిళా కూలీలు గ్రోత్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. మహిళలు భారీగా గుమిగూడి పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టడంతో వారిని పోలీసులు అదుపుచేసే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. మహిళలు పోలీసులపై ఇసుక రువ్వడంతో మహిళా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలకు గాయాలయ్యాయి.