ప్రమాదవశాత్తు పెద్ద బండరాయి మీదపడి... మహిళా కూలి దుర్మరణం
తిరుపతి: ఉపాధి హామీ పనుల్లో అపశృతి చోటుచేసుకుని ఓ మహిళా కూలి అతి దారుణంగా మరణించిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. రామచంద్రపురం మండలం అనుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొప్పరాజుపల్లికి చెందిన సులోచనమ్మ రోజూ మాదిరిగానే ఇవాళ(సోమవారం) కూడా ఉపాధి పనులకు వెళ్లింది. అయితే ఆమె కూలిపనులు చేస్తుండగా పైనుండి పెద్ద బండరాయి దొర్లి ఆమెపై పడింది. దీంతో బండరాయికింద నలిగి సులోచనమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె మరణంతో యావత్ గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది.
తిరుపతి: ఉపాధి హామీ పనుల్లో అపశృతి చోటుచేసుకుని ఓ మహిళా కూలి అతి దారుణంగా మరణించిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. రామచంద్రపురం మండలం అనుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొప్పరాజుపల్లికి చెందిన సులోచనమ్మ రోజూ మాదిరిగానే ఇవాళ(సోమవారం) కూడా ఉపాధి పనులకు వెళ్లింది. అయితే ఆమె కూలిపనులు చేస్తుండగా పైనుండి పెద్ద బండరాయి దొర్లి ఆమెపై పడింది. దీంతో బండరాయికింద నలిగి సులోచనమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె మరణంతో యావత్ గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది