Mangalagiri Rape Case:తుమ్మపూడిలో తీవ్ర ఉద్రిక్తత... నారా లోకేష్ పై వైసిపి శ్రేణుల రాళ్లదాడి

అమరావతి: అత్యాచార బాధితురాలి మృతదేహానికి నివాళులు అర్పించడానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లడంతో దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

First Published Apr 28, 2022, 10:53 PM IST | Last Updated Apr 28, 2022, 10:53 PM IST

అమరావతి: అత్యాచార బాధితురాలి మృతదేహానికి నివాళులు అర్పించడానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లడంతో దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లోకేష్ పాటు నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్ తుమ్మపూడికి చేరుకోగానే వైసిపి శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే టిడిపి, లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఒక్కసారిగా   గుంపులోంచి ఎవరో పెద్ద రాయిని విసిరారు. అయితే ఆ రాయి లోకేష్ పక్కనే పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు వైసిపి శ్రేణులను అక్కడి నుండి పంపించగా లోకేష్ తిరుపతమ్మ మృతదేహానికి నివాళి అర్పించారు. ఇదిలావుంటే తిరుపతమ్మ కుటుంబ సభ్యులను మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే ఆళ్ల రామక‌ృష్ఱా రెడ్డి,, గుంటూరు జిల్లా కలెక్టర్ పరామర్శించారు. తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ వద్ద వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్న నాయకులు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.