Asianet News TeluguAsianet News Telugu

చిలకలూరిపేటలో దారుణం... కట్టుకున్న భర్తను చంపిన భార్య

చిలకలూరిపేట : మానవ సంబంధాలు ఎంత పలుచబడ్డాయో తెలియజేసే సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం వెలుగుచూస్తున్నాయి. 

First Published Nov 12, 2022, 12:29 PM IST | Last Updated Nov 12, 2022, 12:29 PM IST

చిలకలూరిపేట : మానవ సంబంధాలు ఎంత పలుచబడ్డాయో తెలియజేసే సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం వెలుగుచూస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో కట్టుకున్నవారిని కిరాతకంగా చంపేస్తున్న దారుణాలు అనేకం బయటపడుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. పట్టణంలోని అడ్డరోడ్డు ప్రాంతంలో షర్మిల అనే మహిళ భర్త సత్తార్ ను అతి దారుణంగా చంపింది. రక్తపుమడుగులో పడివున్న సత్తార్ ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే సత్తార్ చనిపోయి వుండటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం తరలించారు.