Asianet News TeluguAsianet News Telugu

మద్యం తాగించి, సిగరెట్లతో ఒళ్లంతా కాల్చి... విజయవాడ మహిళపై గ్యాంగ్ రేప్

విజయవాడ : రోజువారి కూలీపనులు చేసుకునే మహిళలను గదిలో బంధించి కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో చోటుచేసుకుంది.

First Published Dec 20, 2022, 9:32 AM IST | Last Updated Dec 20, 2022, 9:32 AM IST

విజయవాడ : రోజువారి కూలీపనులు చేసుకునే మహిళలను గదిలో బంధించి కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో చోటుచేసుకుంది. పని వుందంటూ తీసుకెళ్ళిన నలుగురు దుండగులు మహిళతో మద్యం తాగించి దారుణానికి ఒడిగడ్డారు. మద్యంమత్తులో వున్న మహిళను సిగరెట్లతో ఒళ్లంతా కాలుస్తూ ఆంబోతుల్లా మీదపడి అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. 

విజయవాడలో నివాసముండే లక్ష్మి(35) దినసరి కూలీ. అయితే పని వుందంటూ ఆమెను నలుగురు వ్యక్తులు సనత్ నగర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజి దగ్గర్లోని గదికి తీసుకెళ్లారు. అక్కడ వారితో పాటు మహిళకు మద్యం తాగించి మత్తులోకి వెళ్లిన తర్వాత దారుణానికి ఒడిగట్టారు. మత్తులో వున్న లక్ష్మిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో వదిలిపెట్టకుండా ఆమెను గత మూడ్రోజులుగా గదిలోనే బంధించి సిగరెట్లతో కాలుస్తూ రాక్షసానందం పొందారు. ఎలాగోలా ఈ కామాంధుల నుండి తప్పించుకున్న మహిళ ప్రస్తుతం తీవ్ర గాయాలతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ గ్యాంగ్ రేప్ కేసును సీనియస్ గా తీసుకున్న పెనమలూరు పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.