Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాకం... వైద్యం వికటించి మహిళ మృతి

విజయవాడ : గుండెనొప్పితో హాస్పిటల్లో చేరిన మహిళకు వైద్యం అందించడంతో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిండు ప్రాణం బలయ్యింది.

First Published Dec 7, 2022, 11:05 AM IST | Last Updated Dec 7, 2022, 11:05 AM IST

విజయవాడ : గుండెనొప్పితో హాస్పిటల్లో చేరిన మహిళకు వైద్యం అందించడంతో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిండు ప్రాణం బలయ్యింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన బాధిత కుటుంబం హాస్పిటల్ ఎదుట ఆందోళన దిగారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుండుపల్లి గ్రామానికి చెందిన మహిళ పదిరోజుల క్రితం గుండెలో నొప్పిగా వుందంటూ విజయవాడ వైవి రావు హాస్పిటల్లో చేరింది. అయితే ఆమె కుటుంబం వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో వుండటంతో ఆరోగ్య శ్రీ కింద చేయించుకోవాలని నిర్ణయించారు. మూడురోజుల క్రితమే సర్జరీకి అప్రూవల్ వచ్చినా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. చివరకు మంగళవారం ఉదయం జూనియర్ డాక్టర్లతో సర్జరీ చేయించడంతో పరిస్థితి విషమించి సాయంత్రానికి మృతిచెందినట్లు తెలిపారు. మహిళ మృతితో ఆగ్రహించిన కుటుంబసభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు.