Asianet News TeluguAsianet News Telugu

అమ్మతనంకోసం పరితపించి... ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చాక మృతిచెందిన తల్లి

నందిగామ : పెళ్లయిన ఇరవై ఏళ్లకు ఆమె తల్లి అయ్యింది.

నందిగామ : పెళ్లయిన ఇరవై ఏళ్లకు ఆమె తల్లి అయ్యింది. కానీ ఆ మాత‌ృత్వ మాధుర్యాన్ని ఆమె అనుభవించకుండా... పిల్లలకు తల్లిప్రేమను దూరం చేస్తూ విధి వింతనాటకం ఆడింది. ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన ఆ తల్లి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిధారక ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

నందిగామ మండలం మాగల్లు గ్రామానికి చెందిన ఖాసీం,షేక్ నజీరా(35) దంపతులకు పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కాలేదు. 20ఏళ్ళ సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత నజీరా గర్భం దాల్చింది. ఇటీవల విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నజీరా ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఇలా ఇద్దరు ఆడ, ఓ మగ శిశువుకు ప్రాణంపోసిన ఆ తల్లి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ప్రసవం తర్వాత రక్తం తక్కువగా వుండటంతో చికిత్స అందిస్తుండగా మంగళవారం నజీరా మృతిచెందింది. దీంతో ఖాసీం కుటుంబంలో పిల్లలు పుట్టిన ఆనందం ఆవిరయ్యింది. కుటుంబసభ్యుల కన్నీటి వీడ్కోలు మద్య నజీరా అంత్యక్రియలు జరిగాయి.