భార్య సంపాదనతో జల్సాలు... ఇంతలా దిగజారిన భర్తతో బ్రతకలేనంటున్న ఇల్లాలు
నందిగామ : పనీపాట లేకుండా తన సంపాదనతో జల్సాలు చేస్తున్న భర్త నుండి విడాకులు కోరుతూ వివాహిత ఆందోళనకు దిగింది.
నందిగామ : పనీపాట లేకుండా తన సంపాదనతో జల్సాలు చేస్తున్న భర్త నుండి విడాకులు కోరుతూ వివాహిత ఆందోళనకు దిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి భర్త ఇంటిముందు బైఠాయించింది మహిళ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఈ ఘటన వెలుగుచూసింది.
చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన పద్మజ చార్టెడ్ అకౌంటెంట్. ఈమెకు 17ఏళ్ల క్రితం సురేష్ తో పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు సంతానం. అయితే భర్త ఏ పని చేయకుండా తన సాలరీతో జల్సాలు చేస్తున్నాడని... పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నా అతడి తీరులో మార్పు లేదని పద్మజ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విజయవాడలో రెండు కోట్ల విలువ చేసే తన ఇల్లు ఆక్రమించాడని ఆమె ఆరోపిస్తోంది.ఇలా కుటుంబాన్ని పట్టించుకోకపోవడమే కాదు తన సాలరీ, ఆస్తుల కోసం వేధిస్తున్న భర్త నుండి విడాకులు కావాలంటూ ఇవాళ కూతురు, కొడుకుతో కలిసి పద్మజ ధర్నాకు దిగింది.