పల్నాడులో రెచ్చిపోయిన దొంగలు... వైన్ షాప్ లో చొరబడి భారీ దోపిడీ
గుంటూరు: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులో దొంగలుపడ్డారు.
గుంటూరు: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులో దొంగలుపడ్డారు. ఆదివారం రాత్రి వైన్ షాప్ లోకి చొరబడ్డ దుండుగులు లాకర్ లో వున్న రూ.9లక్షల నగదు దొంగిలించారు. ఇవాళ ఉదయం వైన్ షాప్ లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన సూపర్ వైజర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరాల ఆదారంగా దొంగలను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.