Asianet News TeluguAsianet News Telugu

పెళ్లయిన 10రోజులకే ప్రెగ్నెన్సీ టెస్ట్... అత్తవారింటి ఎదుట మహిళ ధర్నా

మైలవరం: అత్తింటివారు అనుమానంతో వేధించడమే కాదు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ ఓ వివాహిత అత్తింటివారి ఎదుట ఆందోళనకు దిగింది. 
 

మైలవరం: అత్తింటివారు అనుమానంతో వేధించడమే కాదు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ ఓ వివాహిత అత్తింటివారి ఎదుట ఆందోళనకు దిగింది. కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో తన భర్త ప్రత్తిపాటి చంటిబాబు ఇంటి ముందు 7నెలల గర్భిణీ ప్రత్తిపాటి సౌజన్య(24) బందువులతో నిరసనకు దిగింది. కేవలం పెళ్ళైన 10రోజులకే భర్త తనకు గర్భిణీ పరీక్ష చేయించారని... ఇలా అనుమానంతో వేధిస్తుంటే మనస్తాపంతో పుట్టింటికి వెళ్ళినట్లు సౌజన్య తెలిపారు. అప్పటి నుండి తమ ఇంటికి రావద్దంటూ అత్తింటివారు అంటున్నారని తెలిపారు. అయితే అత్తింటివారిపై కేసు పెట్టకుండా కౌన్సిలింగ్ ఇచ్చి తన భర్త వద్దకు చేర్చాలంటూ పోలీసులను కోరారు. దీంతో ఇరు కుటుంబీకులను మైలవరం స్టేషన్ కు తరలించిన కౌన్సెలంగ్ ఇస్తున్నారు.