Asianet News TeluguAsianet News Telugu

శుభకార్యానికి వెళ్ళివస్తుండగా ఘోరం... కారు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

కృష్ణా జిల్లా గన్నవరంలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

First Published Aug 23, 2022, 10:49 AM IST | Last Updated Aug 23, 2022, 10:49 AM IST

కృష్ణా జిల్లా గన్నవరంలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఆర్టిసి బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని మహిళ అక్కడిక్కడే మృతిచెందగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. 

విజయవాడకు చెందిన విద్యుత్ ఉద్యోగి వరప్రసాద్ భార్యతో కలిసి శుభకార్యానికి రాజమండ్రి వెళ్ళాడు. శుభకార్యంలో ఆనందంగా గడిపిన దంపతులు కారులో విజయవాడకు పయనమయ్యారు. ఈ క్రమంలోనే గన్నవరంలో ప్రమాదానికి గురయి వరప్రసాద్ భార్య అక్కడిక్కడే మృతిచెందింది. వరప్రసాద్ తీవ్ర గాయాలపాలయి కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగానే వున్నట్లు సమాచారం.