Asianet News TeluguAsianet News Telugu

భర్త కోసం భార్య ఆత్మహత్యాయత్నం (వీడియో)

అక్రమకేసులో తన భర్తను అరెస్ట్ చేశారని ఓ భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్ననగర్ లో ఈ ఘటన జరిగింది. మహబూబ్ భాష , బోయ లక్ష్మీ దంపతులు స్థానికంగా నివాసం ఉంటున్నారు. గతంలో కొన్ని దొంగతనాలు చేసిన మహబూబ్ భాషా ఇప్పుడవి మానేసి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే 2011 లో జరిగిన ఓ దొంగతనం కేసులో మహబూబ్ భాషా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడంతో  కర్నూలు ccs పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
 తన భర్తకు సంబంధం లేకున్నా అరెస్ట్ చేస్తున్నారనే మనస్తాపంతో లక్ష్మి ఆత్మహత్యాయత్నంకు పాల్పడగా గమనించిన స్థానికులు చాకచక్యంతో లక్ష్మిని కాపాడారు. ఇది అక్రమకేసు కాదని అప్పటి  కేసు పై ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని  పోలీసులు తెలుపుతున్నారు.