Asianet News TeluguAsianet News Telugu

బ్రతుకే కాదు చావులోనూ భర్తతోనే... కేవలం గంటల వ్యవధిలోనే దంపతుల మృతి

విజయవాడ : జీవితాన్ని పంచుకున్న భర్త మరణవార్త విని తట్టుకోలేకపోయిన భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. 

First Published Aug 2, 2023, 4:18 PM IST | Last Updated Aug 2, 2023, 4:18 PM IST

విజయవాడ : జీవితాన్ని పంచుకున్న భర్త మరణవార్త విని తట్టుకోలేకపోయిన భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. కేవలం గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. తిరువూరు సమీపంలోని గంపలగూడెంకు చెందిన నాగేశ్వరరావు(65), రమాదేవి(59) భార్యాభర్తలు. కొద్దిరోజులుగా లివర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నాగేశ్వరరావు చికిత్స పొందుతున్నాడు. అయితే అతడి పరిస్థితి విషమించి మృతిచెందగా ఈ వార్త విని భార్య కూడా షాక్ కు గురయ్యింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి రమాదేవి కూడా ఆకస్మికంగా మరణించింది. భార్యాభర్తలు కేవలం గంటల వ్యవధిలో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.