నెల్లూరు జిల్లాలో అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు... ప్రొక్లెయిన్, టిప్పర్ పై గ్రామస్తుల దాడి


నెల్లూరు జిల్లాలో అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు యదేచ్చగా కొనసాగుతున్నాయి. 

First Published Mar 13, 2022, 12:58 PM IST | Last Updated Mar 13, 2022, 12:58 PM IST


నెల్లూరు జిల్లాలో అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు యదేచ్చగా కొనసాగుతున్నాయి. ఇలా రాత్రివేళల్లో తెల్లరాయి తవ్వకాలను చేపట్టి తరలిస్తున్న అక్రమార్కులను వరికుంటపాడు మండలం ధర్మవరం గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రామస్తులంతా కలిసి తవ్వకాలు చేపడుతున్న ప్రొక్లెయిన్, తరలిస్తున్న టిప్పర్ ను పట్టుకుని ధ్వంసం చేసారు.  వాహనాల తాళాలు స్వాధీనం చేసుకుని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని బందీగా ఉంచుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గుర్తుతెలియని వ్యక్తులు రాత్రివేళల్లో అక్రమంగా తెల్లరాయిని తరలిస్తున్నారంటూ ధర్మవరం గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు గ్రామస్తుల దగ్గరున్న ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.