ముదురుతున్న జలజగడం... పులిచింతల ప్రాజెక్ట్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు
ఇరు తెలుగురాష్ట్రాల మధ్య జగజగడం ముదురుతోంది.
ఇరు తెలుగురాష్ట్రాల మధ్య జగజగడం ముదురుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నదీజలాల పంపకం విషయంలో కేంద్రం వద్ద పంచాయితీకి సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా సరిహద్దుల్లోని ప్రాజెక్టుల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పులిచింతల ప్రాజెక్టు వద్దకు పెద్ద ఎత్తున ఏపీ, తెలంగాణ పోలీసులు చేరుకుని ఎవరి భూభాగంలో వారు బందోబస్తు చేపట్టారు. సరిహద్దులోని ఇతర బ్యారేజీల వద్దకు కూడా ఇరు రాష్ట్రాల పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోంటున్నారు. బ్యారేజీల వద్దకు ప్రజల రాకపోకలను నిలిపివేశారు పోలీసులు.