Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ కాన్వాయ్ ని అడ్డుకున్న రైతులు...

ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి వద్ద సీఎం జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను రైతులు అడ్డుకున్నారు.  

First Published Apr 27, 2023, 1:42 PM IST | Last Updated Apr 27, 2023, 1:42 PM IST

ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి వద్ద సీఎం జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను రైతులు అడ్డుకున్నారు.  పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు 210 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని, ఆ నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కాన్వాయ్ ని రైతులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. సెక్యూరిటీ సిబ్బంది రైతులను పక్కకు నెట్టి కాన్వాయ్ కి దారి కల్పించారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో నార్పల నుంచి పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు వెళుతున్న సమయంలో ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.