గుండెజబ్బున్న మైనర్ పై.. పోలీసుల ప్రతాపం.. ఆస్పత్రి పాలైన బాలుడు..
ఉయ్యూరులో 17 ఏళ్ల మైనర్ పై ఉయ్యూరు రూరల్ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు.
ఉయ్యూరులో 17 ఏళ్ల మైనర్ పై ఉయ్యూరు రూరల్ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. లావుకర్రతో అరికాళ్లమీద కొడుతూ, చేతులు వంచి, తలగోడకేసి గుద్ది రాక్షసంగా ప్రవర్తించారు. దీంతో బాలుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే గుట్టుచప్పుడు కాకుండా ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి ఆచూకీ కోసం వెళ్లిన తల్లిదండ్రులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మైనర్ కు ఆరు నెలల వయసు నుంచి గుండె సమస్య ఉందని, కొట్టుడుకు పిల్లాడు చచ్చిపోతే ఎట్లా అంటూ తల్లి రోధిస్తుంది. విషయం మీడియాకు లీక్ అవడంతో చికిత్స పొందుతున్న మైనర్ బాలుడిని కుటుంబ సభ్యులను పోలీసులు బెదిరించి ఇంటికి పంపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలుడు కావడంతోనే పోలీసులు ఇంత దారుణంగా కొట్టారంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.