Asianet News TeluguAsianet News Telugu
breaking news image

ఏపీలో కొనసాగుతున్న ఉద్యోగుల ఆందోళనల పర్వం... రోడ్డెక్కిన వీఆర్ఏలు

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు, నూజివీడు, చాట్రాయి మండలాల్లో వీఆర్ఏలుచేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. 

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు, నూజివీడు, చాట్రాయి మండలాల్లో వీఆర్ఏలుచేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర వీఆర్ఎల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న వీఆర్ఏలు రిలే దీక్షలు చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమకు కనీసం రూ.21వేల జీతాలు చెల్లించాలన్నది వీఆర్ఏల ప్రధాన డిమాండ్. అలాగే దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వీఆర్ఏలకు వీఆర్వోగా ప్రమోషన్లు ఇవ్వాలని వీఆర్ఏలు కోరుతున్నారు.  ఈ నెల 22వ తేదీ వరకు రిలే దీక్షలు చేపడతామని వీఆర్ఏలు ప్రకటించారు.