Asianet News TeluguAsianet News Telugu

వాలంటీర్ల ఆందోళన... రణరంగంగా మారిన విజయవాడ కార్పోరేషన్

విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద వార్డు, సచివాలయం వాలంటీర్లు నిరసనకు దిగారు. 

First Published Feb 8, 2021, 2:32 PM IST | Last Updated Feb 8, 2021, 2:32 PM IST

విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద వార్డు, సచివాలయం వాలంటీర్లు నిరసనకు దిగారు. తమకు కనీస వేతనం అమలు, ఈఎస్ఐ, పీఎఫ్ లను వర్తింపజేయడంతో పాటు ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనకు దిగారు.  విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వందలాదిగా వాలంటీర్లు చేరుకోవడంతో పరిస్థితి అంతకంతకు ఆందోళనకరంగా మారుతోంది.  వేతనాలు పెంచకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తానంటూ వాలంటీర్లు హెచ్చరిస్తున్నారు. వాలంటీర్ల ఆందోళనను అదుపు చేసేందుకు కార్పోరేషన్ కార్యాలయం వద్దకు పోలీస్ బలగాలు చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా వాలంటీర్ల అరెస్టు దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విజయవాడ కార్పొరేషన్ రణరంగంగా మారింది.