విషాదం... పురుగుల మందు తాగి వాలంటీర్ ఆత్మహత్య

అమరావతి: కుటుంబసభ్యులు మందలించారని మనస్థాపానికి గురయిన వాలంటీర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడ కృష్ణలంకలో నివాసముండే షేక్ లాల్ భాషా(26) రాణిగారి తోటలో వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతడు ఇటీవల విలువైన ఫోన్ పోగొట్టుకోవడంతో ఇంత అజాగ్రత్తగా వుంటే ఎలాగంటూ కుటుంబసభ్యులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురయిన అతడు సీతానగరం రైల్వే బ్రిడ్జి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.   

First Published Aug 24, 2021, 11:13 AM IST | Last Updated Aug 24, 2021, 11:13 AM IST