Asianet News TeluguAsianet News Telugu

రైల్వేస్ తో ఒప్పందం...విశాఖ ప్లాంట్ చరిత్రలో మరో ముందడుగు...

విశాఖ ప్లాంట్ ఇండియన్ రైల్వేస్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాయ్‌బరేలీలో నిర్మించిన ఫోర్జ్డ్ వీల్ ప్లాంటులో వీల్స్ ఉత్పత్తిని ప్రారంభించారు.

విశాఖ ప్లాంట్ ఇండియన్ రైల్వేస్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాయ్‌బరేలీలో నిర్మించిన ఫోర్జ్డ్ వీల్ ప్లాంటులో వీల్స్ ఉత్పత్తిని ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ సీఎండీ తొలి వీల్ ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించారు. మొదటి ఫోర్జ్డ్ వీల్‌ను పరిశీలించారు. త్వరలో పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సీఎండీ తెలిపారు. ఈ ఉత్పత్తులను రైల్వేకు సరఫరా చేస్తామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్ఎంఎస్ 4వ కాస్టర్‌లో రూపొందిస్తున్న 430 ఎంఎం రౌండ్స్ ద్వారా ఈ వీల్స్ తయారు చేస్తున్నట్లు తెలిపారు.