Asianet News TeluguAsianet News Telugu

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉదృతం... జైల్ భరో కోసం కదంతొక్కిన కార్మికులు

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం మరింత ఉదృతమవుతోంది. విశాఖలోని కూర్మన్నపాలెం మెయిన్ గేటు వద్ద కార్మిక సంఘాల జేఏసి ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి తమ నిరసనను తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే వరకు  పోరాడతామని కార్మికులు హెచ్చరించారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ వద్ద పోలీసులు భారీగా మొహరించారు. 