Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు... కదలలేని స్థితిలో బాధితుడు

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పేదవారిని టార్గెట్ చేస్తూ.. 

First Published Apr 27, 2023, 2:13 PM IST | Last Updated Apr 27, 2023, 2:13 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పేదవారిని టార్గెట్ చేస్తూ.. డబ్బులు ఆశచూపి కిడ్నీలు కాజేస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కిడ్నీ మార్పిడి యూనిట్ లేకుండానే కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నాడు ఓ డాక్టర్. పేదవాళ్లు టార్గెట్ చేసి అవయవ వ్యాపారం చేస్తున్నారు నిందితులు. దీనికి సంబంధించిన సమాచారం అందడంతో  ఈ కిడ్నీ రాకెట్ గుట్టు తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.ఈ కేసు వెలుగులోకి రావడంతో ఆస్పత్రినుంచి డాక్టర్  పరమేశ్వరరావు పరారయ్యాడు. ఆస్పత్రి అంతా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది. ఈ కిడ్నీ రాకెట్ లో దళారులు ఇలియాన్, శ్రీను, కామరాజు కీలకంగా ఉన్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో దళారులు అడ్రస్ లేకుండా పోయారు. వీరి బారిన పడిన వినయ్ అనే యువకుడు దయనీయ స్థితిలో ఉన్నాడు.  ప్రస్తుతం కదలిలేని స్థితిలో ఉన్నాడు వినయ్. మాట్లాడడానికి కూడా రాని పరిస్థితిలో ఉన్నాడు.