Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో మరో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్, ఇద్దరు మృతి (వీడియో)

విశాఖ జిల్లా పరవాడ మండలం JNPC ఫార్మాసిటీలో సాయి నార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ గ్యాస్ లేకేజ్ చోటు చేసుకుంది. 

విశాఖ జిల్లా పరవాడ మండలం JNPC ఫార్మాసిటీలో సాయి నార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ గ్యాస్ లేకేజ్ చోటు చేసుకుంది.  బెంజిమిడాజోల్ వేపర్ గ్యాస్ లీక్ జ్ కారణంగా ఐదుగురు తీవ్ర గాయాలయ్యాయి, ఇద్దరు చనిపోయినట్లు పోలీస్ డిపార్ట్మెంట్  చెబుతున్నారు. దగ్గర్లో ఉన్న  ఆర్కే హాస్పిటల్ కి తరలించారు. ఇదిలా ఉండగా గతంలో సాయి నార్  లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇద్దరు మృతి చెందారు. ఎటువంటి భద్రతా చర్యలు పాటించకపోవడం వల్ల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. బాధితులను కలెక్టర్‌ వినయ్, , విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ మీనా పరామర్శించారు.