చేబ్రోలులో ఉద్రిక్తత... మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను నిర్భంధించిన గ్రామస్తులు

గుంటూరు: టిడిపి మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరి చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకు చుక్కెదురయ్యింది. చేబ్రోలు మండలం శేకూరు వేణుగోపాల స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న చెరువులో జరుగుతున్న తవ్వకాలు పరిశీలించేందుకు వెళ్లిన ధూళిపాళ్ళను గ్రామస్తులు అడ్డుకున్నారు.

First Published May 24, 2022, 4:58 PM IST | Last Updated May 24, 2022, 4:58 PM IST

గుంటూరు: టిడిపి మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరి చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకు చుక్కెదురయ్యింది. చేబ్రోలు మండలం శేకూరు వేణుగోపాల స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న చెరువులో జరుగుతున్న తవ్వకాలు పరిశీలించేందుకు వెళ్లిన ధూళిపాళ్ళను గ్రామస్తులు అడ్డుకున్నారు. టిడిపి అధికారంలో వుండగా ఈ గ్రామంలో మట్టి తవ్వకాలు జరిపి రైల్వే పనులతో పాటు ఇతర అవసరాలకు అమ్ముకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పుడు పంచాయతీ తీర్మానంతో గ్రామ ప్రజలకోసం జగనన్న ఇళ్ల స్థలాలు, రోడ్లకు చెరువు పూడిక తీసి ఆ మట్టి వాడుకుంటుంటే నీకెందుకు కడుపు మంట అంటూ గ్రామస్తులు దూళిపాళ్లను నిలదీసారు.  ఇలా గంటకు పైగా ధూళిపాళ్ళను కదలనీయకుండా గ్రామస్తులు నిర్బంధించారు. వారినుండి తప్పించుకోవటానికి ధూళిపాళ్ళ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. చివరకు పోలీసుల రంగప్రవేశంతో గ్రామం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం  ధూళిపాళ్ల నరేంద్ర, తెలుగుదేశం నాయకులపై శేకూరు గ్రామ ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేసారు.