Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ఎమ్మెల్యే రక్షణనిధికి చేదు అనుభవం... సొంత నియోజకవర్గంలోనే

విజయవాడ : అధికార వైసిపి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి సొంత నియోజకవర్గంలో చేధు అనుభవం ఎదురయ్యింది.

First Published Nov 28, 2022, 2:29 PM IST | Last Updated Nov 28, 2022, 2:59 PM IST

విజయవాడ : అధికార వైసిపి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి సొంత నియోజకవర్గంలో చేధు అనుభవం ఎదురయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు వైసిపి ఎమ్మెల్యేలంతా తమతమ నియోజకవర్గాల్లో 'గడపగడపకు మన ప్రభుత్వం' పేరిట ప్రజలవద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎమ్మెల్యే రక్షణనిధి కూడా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుండి ఎమ్మెల్యే చేధు అనుభవం ఎదురయ్యింది. 

స్థానిక వైసిపి నాయకులతో కలిసి తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే రక్షణనిధిని దుందిరాలపాడు గ్రామ యువకులు నిలదీసారు. రెండు సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మాకు, మా గ్రామానికి ఏం చేసారని నిలదీసారు. ఇంతకాలం అభివృద్ది చేయకుండా వదిలేసి ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే మా గ్రామం గుర్తొచ్చిందా... ఎందుకు మా గ్రామంలో తిరుగుతున్నారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేతో పాటు వైసిపి నాయకులు తమను నిలదీసిన యువకులను సముదాయించే ప్రయత్నం చేసారు.