Asianet News TeluguAsianet News Telugu

ఇళ్ల మధ్యలో సెల్ టవర్ నిర్మాణం... తెలప్రోలు గ్రామస్తుల ఆందోళన

గన్నవరం :  మా గ్రామంలో సెల్ పోన్ సిగ్నల్ రాకున్నా పరవాలేదు... 

First Published Dec 12, 2022, 4:36 PM IST | Last Updated Dec 12, 2022, 4:36 PM IST

గన్నవరం :  మా గ్రామంలో సెల్ పోన్ సిగ్నల్ రాకున్నా పరవాలేదు... సెల్ టవర్ మాత్రం నిర్మించడానికి వీల్లేదంటూ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తెలప్రోలు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇళ్లమధ్యలో సెల్ టవర్ నిర్మించి మా ప్రాణాలను బలితీసుకుందామని అనుకుంటున్నారా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ గ్రామస్తులు నిరసన చేపట్టారు. కరెంట్ స్తంభాల కోసమంటూ కొందరివద్ద సంతకాలు తీసుకుని ఇప్పుడు సెల్ టవర్ నిర్మాణం చేపట్టారని... వెంటనే పనులు ఆపకుంటే మేమంతా ఇల్లు వదిలి వెళ్లిపోతామని హెచ్చరించారు. వెంటనే అధికారులు స్పందించి సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివసేలా చూసి మా ప్రాణాలు కాపాడాలని తెలప్రోలు గ్రామస్తులు కోరుతున్నారు.