లుంగి డ్యాన్స్ కు స్టెప్పులేసి ఇరగదీసిన గ్రామ సచివాలయ ఉద్యోగులు.. కానీ.. ఆ తరువాతే...
కర్నూలు జిల్లా, నంద్యాల మండలం పొన్నాపురం గ్రామ సచివాలయ ఉద్యోగి పూజిత పుట్టిన రోజు వేడుకలు కార్యలయంలో నిర్వహించారు.
కర్నూలు జిల్లా, నంద్యాల మండలం పొన్నాపురం గ్రామ సచివాలయ ఉద్యోగి పూజిత పుట్టిన రోజు వేడుకలు కార్యలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు అందరు కలిసి సెల్‌ఫోన్ లో సాంగ్స్ పెట్డి పాటలకు స్డెప్స్ వేసారు. ఉద్యోగులు అట పాటలను ఓ అగంతకుడు సెల్ ఫోన్ రికార్డు చేసాడు.ఈ విడియోలు అలస్యంగా బయటకు వచ్చాయి.ఇదే విషయం పై పంచాయతి సెక్రటరీ రామచంద్రుడు స్పందిస్తూ ఇది జనవరి 19 వ తేదీన జరిగిన సంఘటన, తాము ఎవరం లాక్ డౌన్ ఉల్లంఘించలేదని, సచివాలయం కార్యలయంలో డాన్స్ చేయ్యడం పొరపాటు అంటూనే కరోనా సమయంలో తాము బాధ్యత మరచి మాత్రం ఇలా చేయలేదు అని చెప్పుకొచ్చారు ..ఈ విషయం పై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జరిగిన సంఘటన పై నివేదిక తయారు చేసి వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.