మహిళా రక్షణకై ఖాకీల సీరియస్ యాక్షన్... దగ్గరుండి మరీ అమ్మాయిల ఫోన్లలో దిశయాప్ డౌన్ లోడ్
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. మహిళా రక్షణ కోసం రూపొందించిన దిశ యాప్ ను ప్రతి మహిళ ఆపదలో వున్న సమయంలో ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే విజయవాడలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మహిళలు, యువతులకు దిశ యాప్ పై అవగాహన కల్పించి దగ్గరుండి మరీ ఫోన్లలో దిశ యాప్ ఇన్స్టాల్ చేయిస్తున్నారు. రోడ్లపై మహిళలను ఆపి దిశయాప్ పై అవగాహన కల్పిస్తున్నారు అజిత్ సింగ్ నగర్ ఎస్సై దుర్గా దేవి, ఇతర సిబ్బంది. మహిళలపై అఘాయిత్యాలు దగ్గించాలంటే దిశ యాప్ తప్పని సరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇలా శివారు ప్రాంతాల్లో పోలీసుల చర్యలు జోరందుకున్నాయి.