Asianet News TeluguAsianet News Telugu

తోపులాటలో చిక్కుకున్న విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి... తప్పిన ప్రమాదం

విజయవాడ : తనకు అవమానం జరగడంతో అలిగి మంత్రి పాల్గొన్న అధికారిక కార్యక్రమం మధ్యలోనుంచే వెళ్లిపోయారు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి.

First Published Sep 24, 2022, 5:17 PM IST | Last Updated Sep 24, 2022, 5:17 PM IST

విజయవాడ : తనకు అవమానం జరగడంతో అలిగి మంత్రి పాల్గొన్న అధికారిక కార్యక్రమం మధ్యలోనుంచే వెళ్లిపోయారు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి. నగరంలోని అయోధ్యనగర్ కాలనీలో అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను వైద్యారోగ్య శాఖల మంత్రి విడదల రజని ప్రారంభించారు.  ఈ క్రమంలోనే ఒక్కసారిగా స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు లోపలికి చొచ్చుకురావడంతో తోపులాట చోటుచేసుకుంది. ఇందులో మేయర్ భాగ్యలక్ష్మి ఇరుక్కుపోయారు. ఈ ఘటనతో తీవ్ర అసహనానికి గురయిన మేయర్ కార్యక్రమం మధ్యలోంచే వెళ్లిపోయారు. ఆమెను బుజ్జగించేందుకు పలువురు నాయకులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.