Asianet News TeluguAsianet News Telugu
breaking news image

మైనర్ బాలిక ఇంట్లోకి చొరబడి... విజయవాడ ఆలయ సెక్యూరిటీ గార్డు నిర్వాకం

విజయవాడ: రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయాల్లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. నిత్యం భక్తులతో రద్దీగా వుండే ఇంద్రకీలాద్రి భద్రతా విధులు చేపట్టే సెక్యూరిటీ సంస్థ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలను గాలికొదిలేసి ఇష్టంవచ్చినట్లు ఆలయ సిక్యూరిటీ సిబ్బంది నియామకాలను చేపడుతున్నట్లు మ్యాక్స్ సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి. క్రిమినల్ రికార్డ్ వున్నవారిని కూడా సెక్యూరిటీ గార్డులకు నియమిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లాల్సిన దుర్గమ్మ సన్నిధి అక్రమార్కులకు ఆనవాలంగా మారింది. విజయవాడ దుర్గగుడి సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వెంకటేశ్వర రావు ఇటీవల ఓ మైనర్ బాలికపై దాడికి పాల్పడగా అతడిపై కేసు నమోదయ్యింది. ఈ కేసు విషయంలో తీగ లాగితే డొంక కదిలింది. నిబంధనలకు విరుద్దంగా దుర్గమ్మ సన్నిధిలో పనిచేసేందుకు సెక్యూరిటీ గార్డుల నియామకం జరుగుతున్నట్లు తేటతెల్లమయ్యింది.