ఆ ఏర్పాట్లు చేయలేదు... భవానీ దీక్షధారులు సహకరించాలి: విజయవాడ ఆలయ స్థానాచార్యులు
విజయవాడ : శరన్నవరాత్రి వేడుకల నేపథ్యంలో భవాని దీక్షల విరమణకు ఏర్పాటు చేయడంలేదని....
విజయవాడ : శరన్నవరాత్రి వేడుకల నేపథ్యంలో భవాని దీక్షల విరమణకు ఏర్పాటు చేయడంలేదని.... దీక్షాధారులు సహకరించాలని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివ ప్రసాద శర్మ సూచించారు. ఇరుముడి సమర్పణ,హోమగుండాలను ఏర్పాటు చేయడం లేదని... భవాని దీక్షాధారులు వారి స్వస్థలాల్లోనే గురుభవానీల చేతులమీదుగా దీక్షా విరమణలు చేసుకోవాలన్నారు. కేవలం అమ్మవారి దర్శనానికి మాత్రమే ఆలయానికి రావాలని శివ ప్రసాద శర్మ సూచించారు.
ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసంలో భవానీ దీక్షలు ప్రారంభమవుతాయని... 41 రోజుల తర్వాత దీక్ష విరమణలకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుందని శివ ప్రసాద శర్మ తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి ఆలయ అధికారులు, అర్చకులకు సహకరించాలని సూచించారు