Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్... పాలకమండలి కీలక నిర్ణయాలు

విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ఇవాళ సమావేశమై భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. 

First Published Aug 28, 2023, 7:09 PM IST | Last Updated Aug 28, 2023, 7:09 PM IST

విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ఇవాళ సమావేశమై భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మవారి దర్శనంకోసం వచ్చే వృద్దులు, వికలాంగుల ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో వారికోసం బ్యాటరీ వాహనాలతో పాటు రెండు డీజిల్ వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. అలాగే ఏడాదిలోపు చిన్నారులతో వచ్చే తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే దూరప్రాంతాల నుండి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల వసతికోసం ప్రత్యేకంగా డార్మిటరీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇలా ఆలయ అభివృద్ది, భక్తుల సౌకర్యాలకు సంబంధించి అనేక నిర్ణయాలను పాలకమండలి తీసుకుంది.